09-02-2026 06:56:03 PM
ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజవర్గంలోని నాచారం డివిజన్లో నాలుగు కోట్ల 66 లక్షల రూపాయల అభివృద్ధి పనులను సోమవారం రోజున స్థానిక కార్పోరేట్ శాంతి సాయి జెన్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి తన ధ్యేయమని ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అనంతరం హెచ్ఎంటి నగర్ లోని పెద్ద చెరువును ఆయన పరిశీలించారు. త్వరలోనే నాచారంలో దోమల సమస్యకు పరిష్కరిస్తానని కాలనీవాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈ సూరజ్ వర్క్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ గ్రేటర్ హైదరాబాద్ బిఆర్ఎస్ నాయకులు సాయి జన్ శేకర్ కాలనీ వాసులు పాల్గొన్నారు