గురుకులంలో ర్యాగింగ్ కలకలం
17-08-2026 12:03 AM
కారేపల్లి, ఆగస్టు 16 (విజయక్రాంతి): మండలంలోని గాంధీనగరం గిరిజన గురుకులం, కళాశాలలో ఆటల పోటీలలో తలెత్తి న వివాదం.. శనివారం రాత్రి ఇంటర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరిట టెన్త్ విద్యార్థులపై క్యాంపస్లో దాడి చేశారు. ఇంటర్ విద్యార్థుల ర్యాగింగ్‌కు టెన్త్ విద్యార్థులు తట్టుకోలేక బయటికి వచ్చారు. అయినా వదలకుండా 40 మంది ఇంటర్ విద్యార్థులు విచక్షణా రహితంగా కొట్టారు. భయాందోళనతో వి ద్యార్థులు పరుగులు తీయగా అడ్డు వచ్చిన హిందీ టీచర్‌పైనా దాడి చేశారు. 20 మంది టెన్త్ విద్యార్థులు గాయపడగా వారి తల్లిదండ్రులు ఆదివారం గురుకులానికి వచ్చి ఆందోళన చేశారు. కారేపల్లి ఎస్ ఐ గోపీ కళాశాలకు వచ్చి విచారణ నిర్వహించారు.






