మలిదశ ఉద్యమకారుల సంఘo అధ్యక్షుడిగా ఉప్పుల నాగమల్లు
29-06-2025 12:52 AM
తుంగతుర్తి: తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ఉప్పుల నాగమల్లు తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సామ అంజిరెడ్డి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పల నాగమల్లు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఉద్యమకారుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని, తన ఎన్నికకు సహకరించిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సామ ఆంజిరెడ్డి, పాటు నా తోటి ఉద్యమకారులకు కృతజ్ఞతలు తెలిపారు.






