calender_icon.png 12 September, 2024 | 11:50 PM

బాధ్యతలు స్వీకరించిన అర్బన్ బ్యాంకు పాలకవర్గం

14-07-2024 05:30:04 AM

కరీంనగర్, జూలై 13 (విజయక్రాంతి): కరీంనగర్ అర్బన్ బ్యాంకు నూతన పాలకవర్గం శనివారం కొలువుదీరింది. బ్యాంకు సీఈవో ఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించింది. తమ నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, జిల్లా కాంగ్రెస్ నాయకత్వానికి నూతన పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పాలకవర్గ సభ్యులైన పర్సన్ ఇంచార్జి కమిటీ సభ్యులు గడ్డం విలాస్ రెడ్డి, మడుపు మోహన్, ముక్క భాస్కర్, బీరం ఆంజనేయులు, మహ్మద్ ఖలీంఖాన్, రేగొండ సందీప్, మూల లక్ష్మి రవీందర్‌రెడ్డి, ఎ విద్యాసాగర్, ఇ లక్ష్మణ్‌రాజు, ఎండీ సమీయొద్దీన్, మంగి రవీందర్‌ను బ్యాంకు సిబ్బంది శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.