calender_icon.png 12 January, 2026 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీపీఎం గెలుపుతోనే పట్టణాభివృద్ధి

10-01-2026 12:00:00 AM

రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నాగయ్య

మహబూబాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సీపీఎం గెలుపు ద్వారానే మహబూబాబాద్ పట్టణ అభివృద్ధి జరుగుతుందని, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జీ.నాగయ్య అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడానికి నాయకులు కార్యకర్తలు సైనికుల వలె పని చేయాలన్నారు. శుక్రవారం పట్టణ కార్యదర్శి భానోత్ సీతారాం నాయక్ అధ్యక్షతన జరిగిన పార్టీ విస్తృత సమావేశంలో నాగయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించిన చరిత్ర సీపీఎం కు ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని ఆరోపించారు. మహబూబాబాద్ పట్టణ సమగ్ర అభివృద్ధి, నిరుద్యోగ సమస్య నిర్మూలన, కార్మికుల సంక్షేమం, పేదల అభ్యున్నతి కోసం సిపిఎం ముందుండి కృషి చేస్తుందన్నారు.

ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సూర్ణపు సోమయ్య, ఆకుల రాజు, జిల్లా కమిటీ సభ్యులు సమ్మెట రాజమౌళి, పార్టీ పట్టణ కమిటీ సభ్యులు రావుల రాజు, చిపిరి యాకయ్య, కుమ్మరి కుంట్ల నాగన్న, చాగంటి భాగ్యమ్మ, బానోత్ వెంకన్న, హేమ నాయక్ , తోట శ్రీనివాస్, ఎర్ర శ్రీను, గౌని వెంకన్న, ఎండీ రజాక్, యామగాని వెంకన్న, పులి గుజ్జు వెంకన్న, లాలయ్య  పాల్గొన్నారు.