calender_icon.png 12 January, 2026 | 5:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల్లో ముందు ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలి

10-01-2026 12:00:00 AM

కామారెడ్డి జిల్లా కార్యదర్శి. ఎల్. దశరథ 

రాజంపేట, జనవరి 9 (విజయక్రాంతి): భారత కమ్యూనిస్టు పార్టీ. ప్రచార జాత సందర్భంగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం చేరుకున్న వందేళ్లు పూర్తి చేసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ సందర్భంగా రాజంపేట, బసవన్నపల్లి, ఆరుగొండ, కొండాపూర్, గ్రామాల్లో సిపిఐ జెండా ఆవిష్కరణ నిర్వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ కామారెడ్డి జిల్లా కార్యదర్శి. ఎల్. దశరథ . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలను ప్రజలకు అమలు చేయకుండా రైతు చట్టాలను వెనక్కి తీసుకోకుండా పార్లమెంట్లో మరోసారి ఆమోదించడం, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పది సంవత్సరాలు అవుతున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కనీసము ప్రజలకు ఇచ్చిన హామీలు గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు, వితంతు పింఛన్లు ,షాదీ ముబారక్ ,కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు నిరుపేదలకు అమలు కావడం లేదని కేవలం పార్టీ కార్యకర్తలకి అమలు అవుతున్నాయని వారన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ముందు హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన అన్నారు.

లేకుంటే ఈ నెల జనవరి 18వ తేదీన చలో ఖమ్మం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ బహిరంగ సభకు సుమారుగా 10 లక్షల మంది సిపిఐ కార్యకర్తలు అభిమానులు, కార్మిక సంఘాలు, మేధావులు, విద్యార్థులు నిరుద్యోగులు ,పాల్గొని విజయవంతం చేయాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి.ఎల్. దశరథ్ ,సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి బాలరాజ్, సిపిఐ జిల్లా నాయకులు మల్లేష్, రాజంపేట మండల కార్యదర్శి బత్తుల ఈశ్వర్, హనుమాన్లు నాగమణి స్వప్న రాజవ్వ సాయిలు, రేణుక ,చంద్రయ్య ,రాజయ్య రాములు చంద్రశేఖర్ ,అరుణ్ రాజ గౌడ. లింగం రాజన్న మల్లన్న సాయిరాం సిద్ధిరములు రాజంపేట బసవ పల్లి అరుగొండ కొండాపూర్ గ్రామ శాఖలో జెండా ఆవిష్కరించారు . అదేవిధంగా ప్రజా సమస్యలపై నిరంతరం సిపిఐ పోరాడుతుందని చలో ఖమ్మం సిపిఐ కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆయన అన్నారు.