10-01-2026 12:00:00 AM
కామారెడ్డి అర్బన్, జనవరి 9 (విజయక్రాంతి):రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లా మినిస్ట్రీ, సెక్రటరీ పాపిరెడ్డి ఉత్తర్వుల మేరకు కామారెడ్డి జిల్లా కోర్ట్ లో సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ లో అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా జడల రజనీకాంత్ కు లా మినిస్ట్రీ నుండి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ఆదేశానుసారంగా లా మినిస్ట్రీ, సెక్రటరీ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కోర్టులో ఏజీపీగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన ప్రభుత్వ అధికారులకు జిల్లా కలెక్టర్ కి ధన్యవాదాలు తెలిపారు. నాకు కల్పించిన విధులు సక్రమంగా పూర్తిస్థాయిలో నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.అదేవిధంగా ఈ అవకాశం కల్పించినటువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలియజేశారు.