ఈశ్వరమాదారంలో ఆధ్యాత్మిక వెల్లువ
విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాల్లో పాల్గొన్న కందాళ దంపతులు
ఆలయ అభివృద్ధి కోసం 10 లక్షల భారీ విరాళం అందజేత
కూసుమంచి, జులై 9 (విజయక్రాంతి): కూసుమంచి మండలం, ఈశ్వరమాదారం గ్రామంలో జరిగిన ఆధ్యాత్మిక మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తమ సతీమణితో కలిసి గురువారం పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ & ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ, అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలకు కందాళ దంపతులు హాజరై, స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అభివృద్ధికి భారీ విరాళం:
ఆధ్యాత్మికతతో పాటు గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ ముందుండే కందాళ ఉపేందర్ రెడ్డి, ఈ ఆలయ నిర్మాణ పనుల కోసం రూ. 10 లక్షల భారీ విరాళాన్ని అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు స్థానిక సర్పంచ్ భారీ ఎత్తున స్వాగతం పలికి పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు మరియు మండల మాజీ ప్రజా ప్రతినిధులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు






