calender_icon.png 10 September, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా పాపం అంతా బీజేపీదే

09-09-2025 10:25:06 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రానికి యూరియా అందించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు వివక్ష చూపుతున్నారని మంగళవారం రోజున కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ పార్టీ నేతలతో కలిసి డిసిసి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణకి కేంద్రం కేటాయించిన యూరియా 9.8 లక్షల టన్నులని, మళ్లీ మాట మార్చి ఇస్తానన్న యూరియా 8.3 లక్షల టన్నులని తెలిపి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి పంపిణీ చేసిన యూరియా 5.32 లక్షల టన్నులు సరఫరా చేసిందని, కక్ష పూరితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మైన కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్రతో బీజేపీబీఆర్ఎస్ ఆడుతున్న కుట్రలో భాగంగా రైతన్నలతో  నాయకులే ధర్నాలు చేయిస్తున్నారని అన్నారు.

తెలంగాణలో యూరియా కొరత బీజేపీ నాయకులే కృత్తిమ కొరత సృష్టిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ పక్షాన  మేము రైతన్నలకు అండగా ఉంటామని, తక్షణమే యూరియా కొరత తీర్చకపోతే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్ పాటు, బీజేపీ నాయకుల ఇళ్ళు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ  సమావేశంలో నగర కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామిడి రాజిరెడ్డి, రామిడి తిరుపతిరెడ్డి, , నాయకులు కుంభాల రాజకుమార్, నూనె గోపాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ నాయకులు సాయిరి దేవన్న, వరాహల చారి, గుండా మల్లేష్,  వంగల విద్యాసాగర్, టేల భూమన్న, కోల రమేష్, బండిపల్లి ప్రవీణ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు.