calender_icon.png 10 September, 2025 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనారిటీ సంక్షేమ హాస్టల్ లో సొంత భవనాలకు నిధులు ఇవ్వండి

09-09-2025 10:27:03 PM

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్, ఉట్నూర్ పట్టణాల్లో గల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల సొంత భవనాలు నిర్మించేందుకు నిధులు కేటాయించాలని కోరుతూ మంగళవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఆయన రాష్ట్ర సచివాలయంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్లా కొత్వాల్ ను కూడా మర్యాద పూర్వకంగా కలిశారు. నిధులు మంజూరు చేసి నూతన సొంతభవనాలు నిర్మించేందుకు సహకరించాలని ఆయన కోరారు.