6 April, 2026 | 2:55 AM

హోర్ముజ్‌ను తెరవండి

06-04-2026 01:14 AM
  1. రేపే ఇరాన్‌కు నరకం
  2. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై భీకరదాడులు చేస్తాం
  3. ఐఆర్‌జీసీని మరోసారి తీవ్రంగా హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
  4. ట్రంప్‌నకు పెద్ద సప్రైజ్ ఇస్తాం
  5. అమెరికా ఇరాన్ వార్నింగ్
  6. హాస్యాస్పదంగా ట్రంప్ ప్రకటనలు: ఐఆర్‌జీసీ

వాషింగ్టన్/టెహ్రాన్, ఏప్రిల్5: ఇరాన్‌కు ఇచ్చిన డెడ్‌లైన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రెచ్చిపోయారు. తక్షణమే హోర్ముజ్ జలసంధిని తెరవాలని, లేదంటే మంగళవారం ఇరాన్‌లో బీభత్సం సృష్టిస్తామని, ఆ దేశంలోని విద్యుత్ కేంద్రాలు, వంతెనలపై దాడులు చేసి, వాటిని సర్వనాశనం చేస్తామని హెచ్చరించారు. మరోపక్క అతిత్వరలో ట్రంప్‌నకు పెద్ద సప్రైజ్ ఇస్తామని ఇరాన్ పేర్కొంటూ అమెరికా ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది.

ట్రంప్ ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని, వారి సైనిక చర్యలు విఫ లమయ్యాయని ఐఆర్‌జీసీ తెలిపింది. ‘హోర్ముజ్‌ను తెరవండిరా’ అంటూ ఇరాన్‌పై ట్రంప్ ఆదివారం ట్రూత్ సోషల్ మీడియా లో బూతులతో విరుచుకుపడ్డారు. హోర్ముజ్‌ను తెరవాలంటూ ఇరాన్‌ను ఇష్టారీతిన తిడుతూ పోస్టు పెట్టారు. మంగళవారం నుంచీ ఇరాన్‌లో నరకం తప్పదని హెచ్చరించారు. మునుపెన్నడూ చూడని స్థాయిలో పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు. మంగళవారం పవర్ ప్లాంట్స్‌పై, బ్రిడ్జీలపై ఏకకా లంలో దాడులు చేస్తామన్నారు.

‘హోర్ముజ్ ను తెరవకపోతే మీకు నరకం కనిపిస్తుంది.. చూస్తూ ఉండండి’ అంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా డెడ్‌లైన్‌ను ఇరాన్ పట్టించుకో కపోవడంతో ట్రంప్ నోటికొచ్చినట్టు తిడుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టా రు. ఇరాన్‌లో చిక్కుకుపోయి న ఇద్దరు పైలట్లను అమెరికా సైన్యం తాజాగా కాపాడింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మునుపటి డెడ్‌లైన్‌ను మరోసారి గుర్తు చేశారు. మరోవైపు, ట్రంప్ విధించిన డెడ్‌లైన్‌పై ఇరాన్ శనివారం ఘాటుగా స్పందించింది. ఇదిలా ఉంటే ట్రంప్ వార్నింగ్‌ను ఇరాన్ మళ్లీ పట్టించుకోలేదు. 

ఇరాన్‌లో మౌలిక వసతులపై దాడులు జరిగితే అమెరికాకు నరక ద్వారా లు తెరుచుకుంటాయని ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ జనరల్ అలీ అబ్దుల్లాహీ ఆలియాబాదీ హెచ్చరించారు. గల్ఫ్ ప్రాం తంలోని అమెరికన్ మిలిటరీ స్థావరాలు అన్నిటినీ టార్గెట్ చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే అమెరికా, ఇజ్రాయెల్‌కు భారీ సప్రైజ్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. మేర కు ఇరాన్ భద్రతాధికారి ఓ ప్రకటన చేశారు. నిర్దిష్ట లక్ష్యాలు, సొంత ప్రణాళికల కోసమే ఇరాన్ యుద్ధం చేస్తోందని పేర్కొన్నారు.

అమెరికా, ఇజ్రాయెల్‌కు పెద్ద సప్రైజ్

‘త్వరలో అమెరికా, ఇజ్రాయెల్‌కు పెద్ద సప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాం. అమెరికా లక్ష్యాల జాబితా లోపభూయిష్టంగా ఉంది. మా వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని ట్రంప్ చేస్తున్న ప్రకటనలు హాస్యా స్పదంగా ఉన్నాయి. వారి సైనిక చర్యలు విఫలమయ్యాయి. మేం అమెరికా యుద్ధ విమా నాలను కూల్చేశాం’ అని ఇరాన్ భద్రతాధికారి పేర్కొన్నారు. హోర్ముజ్ జల సంధిని 48 గంటల్లోపు తెరవకుంటే ఇరాన్‌కు నరకం చూపిస్తామని ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ వార్నింగ్‌పై ఇరాన్ జనరల్ అలీ అబ్దుల్లాహి స్పందిస్తూ.. ట్రంప్ హెచ్చరికను తెలివి తక్కువ చర్యగా అభివర్ణించారు. తమ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తే తీవ్రంగా పత్రిస్పంది స్తామన్నారు.