6 April, 2026 | 3:10 AM

చొరబాటుదారులను తరిమికొడతాం

06-04-2026 01:18 AM
  1. టీఎంసీ పాపాలకు జవాబుదారీగా ఉండాలి
  2. జడ్జీలకే రక్షణ కల్పించలేకపోయారు
  3. రాజ్యాంగ వ్యవస్థలనూ గుర్తించరు
  4. శాంతిభద్రతలను కూల్చేయాలని కంకణం కట్టుకున్న టీఎంసీ
  5. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

కోల్‌కతా, ఏప్రిల్ 5: టీఎంసీ ప్రభుత్వం తన పాపాలకు జవాబుదారీగా ఉండాలని, బీజేపీ అధికారంలోకి వచ్చాక చొరబాటుదారులను తరిమికొడుతుందని, బెంగాల్‌లో భయం తొలగిపోయి, విశ్వాసం మేల్కొంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. చొరబాటుదారులను రక్షించేందుకే టీఎంసీ ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తుందన్నారు. సరిహద్దుల్లో జనాభా స్వరూపాన్నే మార్చేందుకు ఈ ప్రభుత్వం భయంకరమైన కుట్రలకు తెరతీసిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. సీఏఏను రద్దు చేసి, చొరబాటుదారులకు రక్షణ కల్పిస్తామని టీఎంసీ నేరుగా చెబుతోందని ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలను కూల్చివేయాలని టీఎంసీ కంకణం కట్టుకుందని ప్రధాని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడితప్పా యని, రాష్ట్ర ప్రభుత్వం జడ్జీలకే రక్షణ కల్పించలేకపోయిందని ఇక ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తుందని విమర్శించారు. ఏ రాజ్యాంగ వ్యవస్థనూ టీఎంసీ గుర్తించదని వ్యాఖ్యానించారు. ఇక్కడి శాంతిభద్రతల పరిస్థితిపై చివ రకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వ చ్చిందని ప్రధాని మోదీ అన్నారు. 

ఆదివారం కూచ్ బెహార్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగించా రు. టీఎంసీ గూండాలు ప్రజలను ఎంతగా బెదిరించినా, భయపడొద్దని చట్టంపై నమ్మకంతో నిర్భయంగా ఓటు వేయాలన్నారు. బీజేపీని గెలిపిస్తే టీఎంసీ పాపాల లెక్కల చిట్టా విప్పుతామని, వారిని చట్టం ముందు దోషులుగా నిలబెడతామని అన్నారు. ప్రజ ల్లో బీజేపీపై పూర్తి నమ్మకం ఉందని ర్యాలీకి విచ్చేసిన ప్రజాసమూహాన్ని చూస్తే అర్థం అవుతుందన్నారు.

మహిళా రిజర్వేషన చట్టా న్ని అమలు చేసేందుకు అవసరమైన బిల్లులను ఆమోదింపచేసుకోవడానికి ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిందని ప్రధాని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దామన్నారు. 2029 లో జరిగే లోక్‌సభ ఎన్నికల నుంచి పశ్చిమ బెంగాల్‌తో సహా దేశవ్యాప్తంగా సోసదరీమణుల లబ్ధికి కృషి చేస్తున్నా మన్నారు. ప్రభు త్వం ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ హక్కు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయడం సరికాదన్నారు. సీట్ల విషయంలో రాష్ట్రాలు ఎలాంటి నష్టాన్ని ఎదుర్కొనవని, అందరూ లబ్ధి పొందుతారని, ప్రతి ఒక్కరి హక్కులు రక్షించబడతాయని మోదీ హామీ ఇచ్చారు.