10 June, 2026 | 2:36 AM

సీఈఐఆర్ పోర్టల్ చేసుకోండి

10-06-2026 01:43 AM

నిర్మల్, జూన్ 9 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఆయా ప్రాంతాల్లో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న దొంగతనం గురైన వెంటనే సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. మంగళవారం జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సేకరించిన ఫోన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఇప్పటివరకు 2250 లబ్ధిదారులకు అందించడం జరిగిందని వీటి విలువ 2.70 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చోరీకి గురైన ఫోన్లు ఎవరూ కొనుగోలు చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి పోలీస్ సిబ్బంది ఉన్నారు.