calender_icon.png 15 November, 2025 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీజర్ వాడుతున్నారా?

29-07-2024 12:00:00 AM

వానకాలంలో వాతావరణం చల్లబడుతుంది. దీంతో చాలామంది వేడి నీటి స్నానం చేస్తుంటారు. కొందరు గీజర్లు వాడుతుంటారు.  గీజర్‌లో ఉండే బ్యూటేన్, ప్రొపేన్ గ్యాస్‌ను విడుదల చేస్తాయి. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  వీటిని వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇళ్లలో గీజర్‌ని వాడేవారు స్విచ్ ఆన్ చేసి అలాగే ఉంచుతారు కానీ అలా చేస్తే ప్రమాదంలో పడ్డట్టే. ఎందుకంటే గీజర్ ఎక్కువసేపు ఆన్ చేసి ఉంచితే ఓవర్ హీట్ అయ్యి పేలిపోయే అవకాశం ఉంది. కాబట్టి స్నానం పూర్తి అయ్యాక స్విచ్ ఆఫ్ చేయాలి. గీజర్‌ను అప్పుడప్పుడు సర్వీసింగ్ చేపిస్తూ ఉండాలి. గీజర్ పాడవ్వగానే కొందరు ఇంటర్నెట్‌లో వీడియోలు చూసి రిపేర్ చేస్తుంటారు. కానీ అలా చేయడం కరెక్ట్ కాదు. అలాంటి సమయంలో టెక్నీషియన్ల సహాయం తీసుకోవాలి. లేదంటే ఫిట్టింగ్ చేసేటప్పుడు కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉంది.