డీకేతో ఉత్తమ్ భేటీ
30-07-2026 12:34 AM
- ఢిల్లీలో కర్ణాటక సీఎంతో సమావేశం
- తుంగభద్ర, కృష్ణానదీ జలాలపై చర్చ
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): కర్ణాటక సీ ఎం డీకే శివకుమార్‌తో బుధవారం ఢిల్లీలో తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్వి సంపత్‌కుమార్ భేటీ అయ్యారు. కర్ణాటక, తెలంగాణ అంతరాష్ట్ర నదీ జలాల అంశంపై చర్చించారు. తుంగభద్ర, కృష్ణా నదీ జలాలు, ఇరు రాష్ట్రాల మధ్య జలాల అంశంపై కీలకంగా చర్చించారు.






