17 July, 2026 | 12:56 AM

ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి: ఏఐవైఎఫ్

17-07-2026 12:56 AM

యువత పోరాటాలకు సిద్ధం కావాలి

ఏఐవైఎఫ్ జిల్లా సహయ కార్యదర్శి చింతల రమేష్ పిలుపు 

కూసుమంచి, జులై 16 (విజయక్రాంతి): కేంద్రంలోని బిజేపి, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో యువతకు అనేక హామీలకు ఇచ్చినప్పుటికీ, ఆచర ణలో విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి చింతల రమేష్, ఏఐవైఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి మద్దోజు శ్రావణ్, మామిండ్ల శ్రీనాథ్ రెడ్డి అన్నారు.

అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మండల మహాసభను కూసుమంచి మండల పరిధిలోని లాల్ సింగ్ తాండా లో మాజీ యువజన నాయకులు భూక్యా నరసింహ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. మహాసభల  ప్రతీకగా ఏఐవైఎఫ్ యువజన సంఘ జెండాను మాజీ యువజన నాయకులు సంగబత్తుల ఉపేందర్ రెడ్డి ఎగురవేశారు.

అనంతరం జరిగిన సభలో మాట్లా డుతూ.. యువజన సమస్య పరిష్కారానికి, విద్య, ఉపాధి హక్కుల సాధనకు, రాజ్యాంగ విలువల పరిరక్షణకు, ప్రజాస్వామ్య, లౌకిక భారత నిర్మాణానికి కొత్త కార్యచరణ అఖిల భారత యువజన సమాఖ్య అనునిత్యం పోరాడుతుందన్నారు. రానున్న రోజుల్లో మరిoత యువజన సమస్యల పరిష్కారానికి పోరాటానికి సన్నద్దమవ్వాలని కోరారు. ఈ మహాసభలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు గుండెపంగు మల్లేష్, మండల సహయ కార్యదర్శి జిల్లా లింగయ్య, సంఘం జిల్లా నాయకులు శ్రీనాథ్ రెడ్డి, కిరణ్ శివ, తెలంగాణ గిరిజన సమాఖ్య జిల్లా నాయకులు భూక్య శ్రీకాంత్, ప్రసాద్, మల్సూర్, భూక్యా వీరన్న నాయకులు జిల్లా నాగయ్యా, తెలు పిచ్చయ్య,  బెల్లి హుస్సేన్, వీరబాబు, జిల్లా వీరబాబు, మోహన్, మహేష్, చంటి, నాగరాజు, మధు, తదితరులు పాల్గొన్నారు.