గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ తప్పనిసరి
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
సంగారెడ్డి, జూన్ 8: గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ నివారణ కోసం ప్ర భుత్వం ఉచితంగా అందిస్తున్న హెచ్పీవీ వ్యాక్సిన్ను జిల్లాలోని 14-15 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలందరూ తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. హెచ్పీవీ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ను నివారించడంలో అత్యంత ప్రభావవంతమైనదని, గర్భాశయ ముఖద్వా ర క్యాన్సర్ నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. వ్యాక్స్పి ఎలాంటి అపోహలు, భయాందోళనలు పెట్టుకోవాల్సి న అవసరం లేదని, అర్హులైన బాలికలు తప్పనిసరిగా ఈ వ్యాక్సిన్ను తీసుకోవాలని ఆయ న సూచించారు.
జిల్లాలో అర్హత కలిగిన ప్రతి బాలికకు మిషన్ మోడ్లో వ్యాక్సినేషన్ నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ఈ వ్యాక్సిన్ ప్రధానంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే అందుబాటులో ఉండేదని, సర్వైకల్ క్యాన్సర్ నిర్మూలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 14-15 సంవత్సరాల మధ్య వయస్సు గల మొత్తం 12,635 మంది బాలికలు ఉండగా, ఇప్పటివరకు 2,786 మంది మాత్రమే హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. మిగిలిన అర్హులైన బాలికలకు వ్యాక్సిన్ అందేలా విద్యాశాఖ, రెసిడెన్షియల్ విద్యాసంస్థల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులకు వ్యాక్సిన్ ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించి, వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించాలని ఆదేశించారు.






