9 June, 2026 | 1:05 AM

విద్యుత్ అధికారులపై దాడికి యత్నం

09-06-2026 12:00 AM

మాజీ సర్పంచ్ పై కేసు నమోదు

నంగునూరు, జూన్ 8: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాల గ్రామంలో ప్రభుత్వ విధుల్లో ఉన్న విద్యుత్ శాఖ లైన్మ్పె దాడికి యత్నించి, విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.కొండంరాజుపల్లి సబ్స్టేషన్లో పనిచేస్తున్న లైన్మెన్ ఎస్.వి.వెంకటరమణ శనివారం ఉదయం తన సిబ్బందితో కలిసి గట్లమల్యాల గ్రామంలో విద్యుత్ లైన్ల పోల్స్ వేసే పాతే పనులు నిర్వహిస్తున్నారు.

ఆ సమయంలో గట్లమల్యాలకు చెందిన మాజీ సర్పంచ్ తిప్పని రమేష్ అక్కడికి చేరుకుని గొడవకు దిగాడు.తన వ్యవసాయ పొలం వద్ద మిడిల్ పోల్ ఎందుకు వేస్తున్నావంటూ విద్యుత్ లేబర్ను తోసివేసి,లైన్మెన్ను బూతులు తిడుతూ కర్రతో దాడి చేయడానికి ప్రయత్నించాడు.

అంతేకాకుండా,పోల్స్ తీసుకొచ్చిన ట్రాక్టర్ తాళం చెవిని లాక్కుని విధులకు తీవ్ర ఆటంకం కల్పించడమే కాకుండా,తిరిగి గ్రామంలో అడుగుపెడితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు.బాధితుడైన లైన్మెన్ వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిప్పని రమ్పే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజగోపాల్పేట ఎస్త్స్ర టి.వివేక్ తెలిపారు.