విద్య, క్రీడలు, క్రమశిక్షణలో అగ్రగామిగా నిలుస్తున్న వాగేశ్వరి కళాశాల
కొత్తపల్లి,(విజయక్రాంతి): వాగేశ్వరి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల అకాడమిక్ వేడుకలు బుధవారం కరీంనగర్ లోని ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాతవాహన యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్, సహితి గ్రూప్ ఆఫ్ కాలేజీ అధినేత ప్రాభాకర్ గౌడ్, వాగేశ్వరి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల చైర్మన్ బివిఆర్ గోపాల్ రెడ్డి, నిగమా ఇంజినీరింగ్ కాలేజ్ జాయింట్ సెక్రటరీ, రత్న గోపాల్ రెడ్డి హాజరయ్యారు. విద్య, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా సత్కారాలు, మెమెంటోలు వైస్ చాన్సలర్ అందజేశారు.
ఈ సందర్భంగా వైస్ చాన్సలర్ ఉమేష్ కుమార్ మాట్లాడుతూ... వాగేశ్వరి విద్యాసంస్థల పనితీరును ప్రశంసించారు. వాగేశ్వరి కళాశాల విశ్వవిద్యాలయం పరిధిలో ఫలితాలు, అడ్మిషన్లు, క్రీడలు మరియు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ, నియమితంగా తరగతులకు హాజరవుతూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ప్రతి విద్యార్థి తమ జీవితంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్ణయించుకుని వాటి సాధన కోసం కృషి చేయాలి అని ఉమేష్ కుమార్ సూచించారు. అనంతరం వాగేశ్వరి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల చైర్మన్ బివిఆర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ వాగేశ్వరి విద్యాసంస్థలు విద్య, క్రమశిక్షణ, అన్ని కార్యకలాపాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్నాయని,విద్యార్థులు పెద్ద కలలు కనాలి, ఉన్నత లక్ష్యాలను సాధించాలి అని సూచించారు.
ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా, ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో వాగేశ్వరి కళాశాల విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ, మరియు విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని ప్రతిబింబించిందని, శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం విద్యార్థులు, సిబ్బందికి మరింత ఉత్సాహాన్ని కలిగించిందని అన్నారు. ఈ కార్యక్రమాలో వాగేశ్వరి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్ డా వెంకట్ రెడ్డి, సతీష్, లింగమూర్తి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ చెన్నోజు రమణ చారి, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




