25 March, 2026 | 3:05 AM

వైరా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్

25-03-2026 12:46 AM

రూ.24,800 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారి

భద్రాద్రి కొత్తగూడెం/వైరా, మార్చి 24 (విజయక్రాంతి):ఖమ్మం జిల్లా వైరా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వరప్రసాద్‌ను మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ 24,800 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా అరెస్టు చేసినట్లు ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై రమేష్ తెలిపారు.

పెనుబల్లి నుంచి ఖమ్మంకు నాలుగు ట్రాక్టర్లు, ఐదు టిప్పర్ల ద్వారా ఇటుకను తోలుకునేందుకు నెలకు రు 24, 800 మొత్తాన్ని ఎంవీఐ డిమాండ్ చేసినట్లు కాంట్రాక్టర్ తెలిపారు.బాధితుడు తమను ఆశ్రయించగా పథకం ప్రకారం వలవేసి పట్టుకున్నట్టు తెలిపారు. వైరాలోని తన కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.