5 చలాన్లు దాటితే ఆర్సీ కట్!
- చలాన్లు కట్టని వాహనదారులపై ఉక్కుపాదం
- ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 24 (విజయక్రాంతి): ట్రాఫిక్ నిబంధనలను అతి క్రమించి, పోలీసుల జారీ చేసిన చలాన్లను బేఖాతరు చేస్తున్న వాహనదా రులకు తెలం గాణ ట్రాఫిక్ విభాగం హెచ్చరిక జారీ చేసిం ది. ఒక వాహనంపై ఐదు కంటే ఎక్కువ పెం డింగ్ చలాన్లు ఉంటే ఆ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను సీజ్ చేయడంతో పాటు రద్దు చేసేందుకు కూడా వెనుకాడబోమని ట్రాఫిక్ డీసీపీ బికె రాహుల్ హెగ్డే హెచ్చరించారు.
చలాన్ల బకాయిల వసూళ్ల కోసం ట్రాఫిక్ విభాగం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. నగరంలోని ప్రధాన కూడళ్లలో నిర్వహించే తనిఖీల్లో వాహన నంబర్ ఆధా రంగా అప్పటికప్పుడు పెండింగ్ చలాన్ల వివరాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఐదు కంటే ఎక్కువ చలాన్లు ఉంటే సదరు వాహన దారుడి నుంచి ఆర్సీని స్వాధీనం చేసుకుని, రవాణా శాఖకు నివేదించను న్నారు.
మోటార్ వాహనాల చట్టంలోని నిబంధనల ప్రకారం, పదే పదే తప్పులు చేస్తూ జరి నాలు కట్టని పక్షంలో సదరు వాహన యజ మాని లైసెన్సును కూడా రద్దు చేసే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ కేవలం జరిమానాల వసూ ళ్ల కోసమే కాదని, రోడ్డు భద్రతపై అవగాహ న కల్పించడానికి కూడా అని అధికారులు చెపుతున్నారు. వా హనదారులు పెండింగ్ చలాన్లను తనిఖీ చేసుకుని వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.




