18 July, 2026 | 12:03 AM

ఖాజీపూర్ ఇసుక క్వారీపై పోరాటం

18-07-2026 12:03 AM
  1. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని రైతుల ఆందోళన 
  2. ప్రజలతో కలిసి ప్రజాప్రతినిధుల ధర్నాలు 
  3. పర్యావరణాన్ని కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

కరీంనగర్/కొత్తపల్లి, జూలై17(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామ పరిదిలో నిర్వహిస్తున్న ఇసుక క్వారీ స్థానికంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయి, సాగు, తాగునీ రు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని గ్రామస్తులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఖాజీపూర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇసుక క్వారీలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ స్థానికులు, సర్పంచ్లు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ధర్నాలు చేపడుతున్నారు. మానేరు డ్యామ్లో పూడికతీత పేరుతో నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు పర్యావరణం దెబ్బతింటున్నదని విమర్శలు వస్తున్నాయి.

గంగుల ఎంట్రీ

ఖాజీపూర్లో ప్రభుత్వం అనుమతించిన ఇసుక క్వారీ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. ఇసుక అక్రమ తరలిం పుతో సాగు, తాగునీటి ఎద్దడి ఎదురవుతోందని గ్రామస్థులు ఆందోళన చెందుతుండగా, వారికి మద్దతుగా మాజీ మంత్రి, కరీంనగర్ ఎంఎల్‌ఏ గంగుల కమలాకర్ రంగంలోకి దిగారు. ఖాజీపూర్ ప్రధాన రహదారిపై గ్రామస్థులతో కలిసి ఆందోళనలో పాల్గొనడంతో క్వారీ రద్దు ఆందోళన మరింత ఉదృతం అయ్యింది.

ఇసుక తీయడం వెంటనే ఆపాలి

మిడ్ మనేర్ సిల్ టెండర్ తీసుకొని అక్రమంగా వాగు లో ఇసుక తొ డుతున్నారు, అధికారుల అండదండలు చూసుకొని డ్యాం పరిధి దాటి ఇసుకను తీస్తున్నారు, దీనివలన సాగు,తాగునీటి, సమస్యలు ఏర్పడి తీవ్ర నీటి కొరత ఏర్పడి , బావులలో నీరు పూర్తిగా అడుగంటి పంటలు ఎండిపోతున్నాయి.

కోమటి రెడ్డి అంజన్ కుమార్, కాజీపూర్ సర్పంచ్