16 April, 2026 | 10:50 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ప్రైమరీ నుంచి విలువైన విద్యను నేర్పాలి

20-02-2026 02:16 AM
  1. స్లేట్ జోన్ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం

ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు

వికారాబాద్, ఫిబ్రవరి- 19: ప్రైమరీ స్థాయి నుండి విద్యార్థులకు మానవీయ విలువలను నేర్పించాలని, తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యతను నేర్పించాలని వికారాబాద్ మండల విద్యాధికారి బాబు సింగ్ అన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని స్లేట్ జోన్ స్కూల్ మొదటి వార్షికోత్సవo పాఠశాల చైర్మన్ వెంకట్రాంరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి వాతావరణం లో  స్లేట్ జోన్ స్కూల్  ఉండటం విద్యార్థులకు శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడుతుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తేనే నిలదొక్కు కోగలమని సూచించారు. స్లేట్ జోన్  స్కూల్ ల్లో ఏర్పాటు చేసిన ప్లే జోన్ వంటివి ఎంతో ఆకట్టుకుంటున్నాయన్నారు.

ప్రస్తుతం మహిళలను క్యాన్సర్ వ్యాధి పట్టిపీడిస్తుందని, ఈ వ్యాధి నివారణకు ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు టీకాలు ఇస్తుందని తెలిపారు. ప్రతి మహిళా ఈ టీకాలను తీసుకోవడంతో పాటు తోటి వారందరికీ పించే ప్రయత్నం చేయాలన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వారి తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి . ఈ సందర్భంగా తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపల్ హనహమేరి, ఉపన్యాసకురాలు శాంభవి, ట్రాస్మ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు నాగయ్య, పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.