24-04-2025 01:22:19 AM
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): దేశంలోనే పురాతన గోల్డ్ ట్రేడర్‌గా పేరొందిన ‘వ్యాల్యూ గోల్డ్’ హైదరాబాద్‌లోని మణికొండలో తమ ఆరో బ్రాంచిని, ఏఎస్‌రావ్ నగర్‌లో ఏడో బ్రాంచీని ప్రారంభించింది. ఈ సంస్థ 1901 నుంచి వినియోగదారులకు సేవలందిస్తోంది. రాబోయే కొన్ని నెలల్లోనే నగరంలోని మరికొన్ని చోట్ల తమ బ్రాంచాలను ప్రారంభించనున్నట్టు వ్యాల్యూ గోల్డ్ డైరెక్టర్ చందా అభిషేక్ చందా పేర్కొన్నారు.
వచ్చే నెలలో పంజాగుట్టాలో తమ నూతనంగా మరో బ్రాంచిని ప్రారంభిస్తామని వెల్లడించారు. తమ విలువైన వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్టు అభిషేక్ వెల్లడించారు. ‘ఉన్నత విద్య, వ్యాపారం, ఆరోగ్య అవసరాల కొరకు బంగారం ఓ గొప్ప ఆస్తి, అలాంటి బంగారాన్ని సరైన ధరకు అమ్ముకోవడానికి వ్యాల్యూ గోల్డ్ సరైన వేదిక.
వ్యాల్యూ గోల్డ్‌లో బంగారం మార్పిడి ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పారద్శకంగా జరుగుతుంది. వినియోగదారులు తమ బంగారాన్ని తీసుకొచ్చి స్వచ్ఛత కోసం పరీక్షించిన తర్వాత వారి ఖాతాలోకి తక్షణమే నగదును బదిలీ చేస్తారు. అదే విధంగా తాకట్టు పెట్టిన బంగారానికి సంబంధించిన పత్రాలను పరీక్షించి, భౌతికంగా ధ్రువీకరించిన తర్వాత తాకట్టు పెట్టిన బంగారం తక్షణమే విడుదల చేస్తారు.
అనంతరం మార్కెట్ విలువ ప్రకారం మొత్తం నగదు విడుదల చేస్తారు’ అని అభిషేక్ చందా తెలిపారు. మణికొండ, ఏఎస్‌రావు నగర్‌లలో తమ నూతన బ్రాంచీలను ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మా కస్టమర్లు మాపై ఉంచిన నమ్మకంతోనే మరిన్ని బ్రాంచీలను విస్తరిస్తున్నట్టు పేర్కొన్నారు.