16 March, 2026 | 5:10 PM

మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్ష

24-04-2025 01:21 AM

కోదాడ ఏప్రిల్ 23: మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష అని కోదాడ ట్రాఫిక్ ఎస్‌ఐ మల్లేష్ అన్నారు.జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి  కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ సెంటర్ వద్ద  వాహనాల తనిఖీలు చేపట్టారు..ఇందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ఇద్దరు పట్టుబడినట్లు ఎస్త్స్ర మల్లేష్ తెలిపారు.

పట్టుబడిన వారిని బుధవారం కోర్టులో హాజరు పరచగా ఒకరికి  ఒక్క రోజు జైలు శిక్ష  రూ.2000 జరిమానా, అదేవిధంగా మద్యం సేవించిన  ఒక్కరికి రూ.2000/- జరిమానా  విధిస్తూ జడ్జి  తీర్పు చెప్పినట్లు  ట్రాఫిక్ ఎస్‌ఐ మల్లేష్   తెలిపారు.మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడే వారికి చలానాలు విధించడంతో పాటు కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఎస్త్స్ర తెలిపారు.