calender_icon.png 12 May, 2025 | 6:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల పిల్లలు పాఠశాలలో చేరేలా ప్రోత్సహించాలి

24-04-2025 01:22:50 AM

 జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

చొప్పదండి,ఏప్రిల్23(విజయక్రాంతి): వలస కార్మికుల పిల్లలను చదువుకు దగ్గర చేసి వచ్చే విద్యా సంవత్సరం వారి వారి ప్రాంతాల్లో పాఠశాలల్లో చేరే విధంగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.

చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వలస కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక తరగతి గదిని కలెక్టర్ సందర్శించారు. కార్మికుల పిల్లలతో హిందీ, ఒడియా భాషల్లో ముచ్చటించారు. పిల్లలకి ఇస్తున్న ఆహారం, బోధన విధానాన్ని గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వలస కార్మికుల పిల్లలు కార్మికులుగా మారకూడదని ఉద్దేశంతోనే జిల్లాలో ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేశామని అన్నారు. వారిని చదువుకు దగ్గర చేయడం ద్వారా వారి ప్రాంతాల్లో పాఠశాలలకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు.  కార్యక్రమంలో తహసిల్దార్ నవీన్ కుమార్, మండల విద్యాధికారి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు జి వీరేశం, శ్రీలత పాల్గొన్నారు.