26 August, 2026 | 1:44 AM

మిలాద్ ఉన్ నబీ పండుగను శాంతియుతంగా నిర్వహించాలి

26-08-2026 12:21 AM

- ముస్లిం సోదరులకు ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు సూచన

ఇల్లెందు,(విజయక్రాంతి): బుధవారం జరగనున్న మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ యు. వెంకన్న బాబు ముస్లిం మత పెద్దలు, సోదరులతో ముందస్తు సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మిలాద్ ఉన్ నబీ పండుగను సోదరభావం, శాంతి, ప్రేమానుబంధాలతో ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.

ఇతరుల మత విశ్వాసాలను, ఆచార సంప్రదాయాలను కించపరచకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కోరారు. ఎవరి మతాన్ని వారు గౌరవించడంతో పాటు ఇతర మతాల పండుగలు, సంప్రదాయాలను కూడా గౌరవించాలని తెలిపారు. పండుగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో సీఐ తాటిపాముల సురేష్, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.