శ్రీశ్రీశ్రీ కోదండ రామాలయంలో వనమహోత్సవం
03-08-2026 12:50 AM
గాంధారి, ఆగస్టు 2 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తిప్పారం తండాలో గల శ్రీశ్రీశ్రీ కోదండ రామాలయంలో ఘనంగా వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యమానికి గాంధారి మాజీ జడ్పీటీసీ, బిఅర్‌ఎస్ రాష్ట్ర నాయకులు హరాలే తానాజీ రావ్ హాజరై మొక్కలు నాటారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటి దానిని సంరక్షించాలి అని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఆయన మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం ఆలయంలోని నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారి నవీన్, తండా సర్పంచ్ గంగారం నాయక్, మాజీ సర్పంచ్ బిషన్ నాయక్, ఉప సర్పంచ్ మంజ గోపాల్, ఆలయ కమిటి చైర్మన్ టికారాం, మంజ పెంటయ్య, బిర్మల్ నాయక్, తాన్ సింగ్, తండా ప్రజలు పాల్గొన్నారు..






