మండలంలో వనమహోత్సవం కార్యక్రమం.
ఎర్రుపాలెం ఆగస్టు 25( విజయ క్రాంతి): మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ లలో మంగళవారం నాడు వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వన మహోత్సవానికి హాజరైన మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహరావు మాట్లాడుతూ పర్యావరణ వలన ప్రకృతి సమతోల్యం సాధించడం వలన భావితరాలతోపాటు వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని పేర్కొన్నారు.
కావున ప్రతి ఒక్కరూ ఈ వన మహోత్సవంలో పాల్గొని మొక్కలను నాటాలని పేర్కొన్నారు.గ్రామంలో మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం యొక్క ఆవశ్యకతను ప్రజలకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఎంపీడీవో ఎం ఎస్ ఎస్ శారధ దేవి, ఏపీఓ కె. నాగరాజు , ఏపిఎం హరి నారాయణ , సీసీలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఎఫ్ఏలు, మేట్స్ లు, డ్వాక్రా సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, ఇతర శాఖల సిబ్బంది, మండలం లోని అన్ని గ్రామ పంచాయతీ ల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ సభ్యులు, ఉపాధి హామీ సిబ్బంది, ఐకెపి సిబ్బంది, ఈ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు






