25 August, 2026 | 4:45 PM

టిజిఎస్ డబ్ల్యూఆర్ ఎస్ లో స్పాట్ కౌన్సిలింగ్

25-08-2026 04:13 PM

ముకరంపుర, ఆగస్టు 25(విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2026- 27 విద్యా సంవత్సరానికి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ ల సొసైటీ పరిధిలోని పాఠశాలలు మరియు కళాశాలలో 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో మిగిలిన కాలేజీ సీట్లను భర్తీ చేయుటకు ఈనెల 27 ఉదయం 9 గంటల నుండి స్పాట్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నట్టు కరీంనగర్ జిల్లా కోఆర్డినేటర్ ఒక పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. తల్లిదండ్రులు టి జి ఎస్ డబ్ల్యూ ఆర్ ఎస్ జూనియర్ కళాశాల చింతకుంట లో హాజరై స్పాట్ కౌన్సిలింగ్ లో పాల్గొన వలసిందిగా కోరారు. అన్ని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు జిరాక్స్ ప్రతులను కూడా వెంట తీసుకురావాలని తెలియజేశారు.