25 August, 2026 | 4:39 PM

పుట్టినరోజు సందర్భంగా 1,200 మొక్కల నాటకం

25-08-2026 03:48 PM

కరీంనగర్ క్రైమ్ ఆగష్టు 25 (విజయ క్రాంతి): అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, డిస్ట్రిక్ట్ 137-A ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో 1,200 మొక్కలను నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆరు రోజుల పాటు నిర్వహించారు. ఆగస్టు 24న ఇంజనీర్ కోలా అన్నారెడ్డి  పుట్టినరోజు సందర్భంగా, ఆగస్టు 25న బి. తిరుపతి రాజు  పుట్టినరోజు సందర్భంగా, ఆగస్టు 26న శాస్త్రి  పుట్టినరోజు సందర్భంగా, ఆగస్టు 27న కరీంనగర్ డిస్ట్రిక్ట్ 137-A గవర్నర్ కొంజర్ల మహేష్  పుట్టినరోజు సందర్భంగా, అలాగే ఆగస్టు 30న శ్రీ చెరిమాల వెంకటేశ్వర్లు పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇంజనీర్ కోల అన్నారెడ్డి ఘనంగా సన్మానించి, అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణను ప్రధాన లక్ష్యంగా చేసుకుని అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 137-A నిరంతరం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి, వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇంజనీర్ కోల అన్నారెడ్డి, డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, జిల్లా గవర్నర్ కొంజర్ల మహేష్, ఈద కుమారస్వామి, పులాల శ్యామ్, సాగర్ రెడ్డి, పండుగ నాగరాజు, సీహెచ్ వెంకటేశ్వర్లు, సోమవారపు వెంకన్న, గాలిపల్లి నాగేశ్వర్ తదితర ముఖ్య నాయకులు, శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రధానాచార్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.