24 June, 2026 | 3:11 PM

Breaking News

ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా మహేశ్వర్ రెడ్డి   •   నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్‌కు నూతన మండల అధ్యక్షుల నియామకం   •   పాఠశాలకు వచ్చిన జాతీయ పక్షి.. నెమలిని చూసి మురిసిపోయిన చిన్నారులు   •   విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ   •   పారిశుద్ధ్య పనులు ముమ్మరం   •   గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేయాలి   •   జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తహశీల్దారుకు వినతి   •   యువతను ప్రమాదంలోకి నెట్టే మాదకద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి   •   యువత, చిన్నారులు డ్రగ్స్ పట్ల దూరంగా ఉండాలి: సీఐ సంజీవ్   •  

పోలీస్ కంప్లైంట్ సిద్ధం

03-05-2026 12:00 AM

వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర కలిసి ఓ భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకెక్కించిన ఆ చిత్రమే ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ సినిమా మే 22న థియేటర్లలో విడుదల కాబోతోంది.

ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన కృష్ణసాయి బర్త్‌డే సందర్భంగా తన అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణపై ఈ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు. ఇంకా చిత్రంలో రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేశ్, దిల్ రమేశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఆరోహణ సుధీంద్ర, సంజీవ్ మేగోటి, సుధాకర్ మారియో; సినిమాటోగ్రఫీ: ఎస్‌ఎన్ హరీశ్, సొండెకొప్ప; ఆర్ట్: కేవీ రమణ; ఎడిటింగ్: అనుగోజు రేణుకాబాబు.