24 June, 2026 | 2:43 PM

Breaking News

బుధవారంపేటలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం   •   జోరుగా జీరోలో చల్లని పానీయ వ్యాపారం   •   అర్హులైన పేదలందరికీ ఇళ్లు   •   రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'   •   'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •  

అంగరంగ వైభవంగా వాసవి మాత భూమి పూజ కార్యక్రమం

26-04-2026 03:11 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి పట్టణ కేంద్రంలో వాసవి మాత ఆలయం సమేత నగేశ్వర స్వామి, విగ్నేశ్వరుడు ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం వేద పండితులైన, సూర్యాపేట వాస్తవ్యులు జై మొదట నగేశ్వర స్వామి పూజ, అనంతరం వాసవి మాత భూమి పూజ కార్యక్రమాన్ని తుంగతుర్తి మండల ఆర్యవైశ్య మహాసభ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలతో, ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, భూమి పూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా, చప్పట్లతో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సదాచార్ ట్రస్ట్ చైర్మన్, వాసవి మాత ట్రస్ట్ సభ్యులు ఈగ దయాకర్ గుప్తా మాట్లాడుతూ, వాసవి మాత ఆశీస్సులతో, భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నామని తెలియపరిచారు. వాసవి మాత ఆలయ నిర్మాణంలో రాష్ట్ర, జిల్లా, మండల ,నియోజకవర్గం ఆర్యవైశ్యులు ప్రత్యేకంగా ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ఇప్పటి వరకు ఆలయ నిర్మాణంలో ఆర్థిక సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ నిర్మాణం అయేంతవరకు ప్రతి ఒక్కరు ఐకమత్యంతో పని చేయాలని కోరారు.

 ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల ఆర్యవైశ్య మహాసభ సంఘం అధ్యక్షులు ఈగ నాగన్న, సీనియర్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఓరుగంటి అంతయ, తాటికొండ సీతయ్య, పోలవరపు సంతోష్ ఈగల లక్ష్మయ్య శరీరాల మల్లయ్య, బుద్దా వీరన్న, మాశెట్టి వెంకన్న, గోపారపు సత్యనారాయణ, గుండా శ్రీనివాస్ బండారు నాగన్న, ఓరుగంటి సూర్య ప్రకాష్ ఓరుగంటి అశోక్, ఓరుగంటి సుభాష్, ఓరిగంటి శ్రీను, తల్లాడ చుక్కయ్య, ఈగ సోమయ్య, రామ నరసయ్య, తాళ్ల పెళ్లి సత్యనారాయణ, బ్రహ్మాండపల్లి సోమయ్య , వివిధ మండలాల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.