22 June, 2026 | 8:01 PM

Breaking News

పెన్షనర్ ల సమస్యను పరిష్కరించండి   •   పెంచిన ఎరువులు, డీజిల్, పెట్రోల్ ధరలు తక్షణమే తగ్గించాలి   •   ప్రైమరీ టీచర్ల భర్తీలలో జిల్లా వ్యాప్తంగా ఒకే విధానం కొనసాగాలి   •   కోయగూడెం ఓసీపీలో సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) తిరుమల రావు పర్యటన   •   అమెరికాలో గంగారం యువకుడు మృతి   •   విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •   గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: టిపిటిఎఫ్   •   వీబీజీ రాంజీ చట్టంతో కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి   •  

వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి

25-01-2026 12:00 AM
  1. కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు 
  2. కేశవపూర్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న పార్టీ శ్రేణులు

మంథని, జనవరి24(విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలని, వీబీజీ, రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు డిమాండ్ చేశారు. శనివారం హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఏల్కతుర్తి మండలం కేశవపూర్ గ్రామంలో డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంఎన్ ఆర్ ఈజీఏ పేరు మార్పుకు వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొని మాట్లాడారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వీబీజీ, రామ్ జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని కోరారు.ఎల్కతుర్తి మండలంలోని తిమ్మాపూర్ , గుంటూరుపల్లి గ్రామాల్లో కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేసితీర్మాన పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో టీపీసీసీ పరిశీలకులు, ప్రధాన కార్యదర్శి మోత్కురి ధర్మారావు, గ్రామ సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.