calender_icon.png 25 January, 2026 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్తీ గుడిసె వాసులకు తలసాని భరోసా

25-01-2026 12:00:00 AM

కోర్టు స్టే మంజూరు

కష్టకాలంలో అండగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపిన గుడిసె వాసులు

సనత్ నగర్, జనవరి 24 (విజయక్రాంతి): మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో సనత్ నగర్ లోని దాసారం బస్తీ గుడిసె వాసులకు ఉపశమనం లభించింది. గత 25 సంవత్సరాలకు పైగా 300 కుటుంబాలు దాసారం బస్తీలో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. వీరంతా వాహనాలలో చెత్తను సేకరి స్తూ ఉపాధి పొందుతున్నారు. కాగా కొంద రు ప్రయివేట్ వ్యక్తులు వారిని బలవంతంగా ఖాళీ చేయించి ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల. పోలీసుల సహకారంతో భయబ్రాం తులకు గురి చేసి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు.

దీంతో ఆందోళనకు గురైన బాధితులు స్థానిక నాయకుల సహకారంతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి తమ గోడును విన్నవించారు. స్పందించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బస్తీలో పర్యటించి అన్ని విధాలుగా అండగా ఉంటానని, ఎవరికి భయపడొద్దని భరోసా ఇచ్చారు. కష్ట కాలంలో తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు గుడిసె వాసులు కృతజ్ఞతలు తెలిపారు. కోర్టుకు సమర్పించాల్సిన వివరాలను గుడిసె వాసుల నుండి సేకరించడంలో బీఆర్‌ఎస్ నాయకులు గౌతమ్ శేషుకుమారి, న్యాయవాదుల కు సహకరించారు. ఈ కార్యక్రమంలో గుడిసె వాసులు తిమ్మప్ప, సురేష్, తిరుమలయ్య, సూరి, రవి తదితరులు ఉన్నారు.