calender_icon.png 25 January, 2026 | 7:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దమ్మాయిగూడ వార్డా, సర్కిలా?

25-01-2026 12:00:00 AM

జీహెచ్‌ఎంసీ బోర్డుపై తప్పిదం అధికారుల నిర్లక్ష్యమేనా?

దమ్మాయిగూడ, జనవరి 24, (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్కాజిగిరి జోన్‌కీసర సర్కిల్లో ఉన్న దమ్మాయిగూడ 4వ వార్డు కార్యాలయ బోర్డుపై ‘దమ్ముయిగూడ సర్కిల్’గా పేర్కొనడం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. ఈ తప్పిదం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమా? లేక దమ్మాయిగూడను ప్రత్యే క సర్కిల్గా ప్రకటించారా? అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ అధికారికంగా దమ్మాయిగూడ కేవ లం ఒక వార్డుగా మాత్రమే కొనసాగుతోం ది. అలాంటిది, 4వ వార్డు కార్యాలయ బోర్డు పై ‘సర్కిల్’ అని పేర్కొనడం ఏమిటన్న ప్రశ్న లు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ పరిధుల్లో బోర్డులు, గుర్తింపులు అత్యంత ప్రాధాన్యత కలిగినవిగా ఉండగా, ఇలాంటి స్పష్టత లేని వివరాలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయని స్థానికులు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై దమ్మాయిగూడ ప్రజలు మాట్లాడుతూ సర్కిల్గా ప్రకటిస్తే అధికారిక ఉత్తర్వులు ఎక్కడ? లేకపోతే బోర్డు మార్చడంలో నిర్లక్ష్యమా? ఇలాంటి తప్పులు పాలనా వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయి అని విమర్శిం చారు.  ఇది కేవలం అక్షర దోషమా? లేక శాఖల మధ్య సమన్వయ లోపమా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. ఈ వ్యవహారంపై కీసర మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, దమ్మాయిగూడా స్థితిగతులపై స్పష్టత ఇవ్వాలని బోర్డులోని తప్పును సరిదిద్దాలని ప్రజ లను అయోమయానికి గురిచేసిన అంశంపై వివరణ ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాలనలో స్పష్టత, బాధ్యత లేకుంటే ప్రజల్లో అనుమానాలు తప్పవన్నది ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.