వీబీజీ రాంజీ పథకం ఉద్యోలు పెన్డౌన్, షట్ డౌన్
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): వీబీజీ రాంజీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు పెన్డౌన్,షట్ డౌన్ ప్రకటించారు. పేస్కేల్ అమలు చేయాలని రెండు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని పేర్కొంటూ వీబీజీ రాంజీ ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ప్రతీనెల సకాలంలో జీతాలు చెల్లించాలని, అదేవిధంగా ఇంద్రవెల్లి సభలో మంత్రి సీతక్క ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని ఇతర ఉద్యోగులైన డీఆర్‌డీఏ విభాగాల ఉద్యోగులకు చెల్లించిన విధంగా సమాన వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట షట్ డౌన్,పెన్డౌన్ నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. నేడు కుండా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈసీ సాయిలు, టెక్నికల్ అసిస్టెంట్లు సత్య ప్రసాద్, జయశ్రీ, సంగీత, కంప్యూటర్ ఆపరేటర్లు విజయ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.






