ఇంటాచ్ జాతీయ కార్యవర్గానికి వేదకుమార్ ఎన్నిక
దక్షిణ భారతానికి గర్వకారణం
హైదరాబాద్, ఏప్రిల్ 17(విజయక్రాంతి): న్యూ ఢిల్లీలోని ఇంటాచ్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఇటీవల (2026 మూడు సంవత్సరాల కాలానికి ఇంటాచ్ గవర్నింగ్ కౌన్సిల్‌కు ఎన్నికైన ఇంజనీర్ వేదకుమార్ మణికొండ, ఇప్పుడు ఇంటాచ్ జాతీయ కార్యవ ర్గానికి కూడా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఇంటాచ్ చైర్మన్ అశోక్ సింగ్ ఠాకూర్, సభ్య కార్యదర్శి రవీంద్ర సింగ్ (రిటైర్డ్ ఐఏఎస్) సమక్షంలో ప్రకటించారు.
ఈ గౌరవం ఆయన నాయకత్వం, అనుభవం, వారసత్వ పరిరక్షణపై ఉన్న అంకితభావానికి గుర్తింపుగా నిలుస్తోంది. ఈ పదవికి ఆయన ఎన్నిక కావడం ద్వారా సంస్థ పనుల్లో ఆయన మరింత సమర్థంగా సేవలందిస్తారనే నమ్మకం వ్యక్తమవుతోంది. ఈ విజయం ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశం నుంచి ఇంటాచ్ జాతీయ కార్యవర్గానికి ఎన్నికైన కొద్దిమందిలో ఇంజనీర్ వేదకుమార్ మణికొండ ఒకరు.
ఇది ఆయన వ్యక్తిగత కృషితో పాటు, జాతీయ స్థాయిలో దక్షిణ భారతదేశ ప్రాధాన్యం పెరుగుతున్నదానికీ సూచిస్తుంది. సాం స్కృతిక వారసత్వం, పరిరక్షణ, విద్యా రంగాల్లో ఆయన చేసిన దీర్ఘకాల సేవలతో, ఆయన జాతీయ కార్యవర్గంలో భాగమవడం ఇంటాచ్ కార్యక్రమాలను మరింత బలపరచడం లో, దేశవ్యాప్తంగా విస్తరించడంలో సహాయపడుతుంది.






