17వ వార్డు తమ్మరలో వాగు పూడికతీత పనులు ప్రారంభం
మున్సిపల్ చైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు
కోదాడ, మే 28: వర్షాకాలంలో పట్టణ ప్రజలకు వరద ముంపు సమస్యలు తలెత్తకుండా మున్సిపాలిటీ పరిధిలో ముందస్తు చర్యలు చేపట్టామని కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఏర్నేని కుసుమ వెంకటరత్నం బాబు తెలిపారు. గురువారం కోదాడ పట్టణంలోని 17వ వార్డు తమ్మర సమీపాన ఉన్న వాగులో పూడికతీత, పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపు పనులను ఆమె స్వయంగా పరిశీలించి ప్రారంభించారు.
వరద నీరు సాఫీగా ముందుకు సాగక పట్టణ ప్రజలు, శిరిడి సాయి నగర్ ప్రాంత వాసులు ముం పునకు గురై అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. వరద నీరు ఎలాంటి అ డ్డంకులు లేకుండా సాఫీగా వెళ్లేలా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమాదేవి కౌన్సిలర్లు యలమందల నరసయ్య, కర్రీ సుబ్బారావు, నాయకులు బుర్ర పుల్లారెడ్డి, నాగేంద్రబాబు, శ్రీనివాస్, భాస్కర్,లైటింగ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






