14 July, 2026 | 4:29 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

ఏప్రిల్ 12న వీర హనుమాన్ విజయ యాత్ర

29-03-2025 08:45 PM

కరపత్రాలు ఆవిష్కరించిన విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నేతలు..

కరీంనగర్ (విజయక్రాంతి): ఏప్రిల్ 12వ తేదీన నగరంలో వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి ఆదిమూలం విద్యాసాగర్, భజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్ కన్నం శంకర్ తెలిపారు. ఈ యాత్రకు సంబంధించిన కరపత్రాలు, వాల్ పోస్టర్లను శనివారం బిఎంఎస్ అనుబంధ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ యాత్ర గాంధీ రోడ్డులోని రామాలయం వద్ద ప్రారంభమై టవర్ సర్కిల్, ప్రకాశం గంజ్, కమాన్ చౌరస్తా, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, బస్టాండ్, గీత భవన్, కోర్టు రోడ్డు, మంచిర్యాల చౌరస్తా మీదుగా కొనసాగుతుందని తెలిపారు. ఈ యాత్ర ద్వారా హిందూ సమాజన్ని జాగృతం చేయడానికి విశ్వహిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షులు డాక్టర్ రామ్ సింగ్ హాజరవుతారని చెప్పారు. 

ధైర్యం, శక్తి సామర్థ్యాలకు ప్రతీక అయినటువంటి హనుమంతున్ని ఆదర్శంగా తీసుకొని హిందూ యువత దేశ, ధర్మ రక్షణ కోసం పాటుపడాలనీ, లవ్ జీహాదీల నుండి మాతృ మూర్తుల రక్షణ, మత మార్పిడుల నిరోధం కోసం ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాంత గోరక్ష కమిటీ సభ్యుడు ఊటుకూరి రాధాకృష్ణారెడ్డి, జిల్లా సహా కార్యదర్శి తోట రాజేందర్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ జిల్లా కో కన్వీనర్ గుజ్జేటి రాజేందర్, నగర కన్వీనర్ ఎల్లబోయిన మహేష్, నగర గోరక్ష ప్రముఖ్ వంశీ, నగర విద్యార్థి ప్రముఖ్ సంతోష్, నగర సహా సంయోజక్ రంజిత్, అలిమిల్ల సతీష్, నగర సత్సంగ్ ప్రముఖ్ వంగర ఆంజనేయులు, భజరంగ్ దళ్ నగర కన్వీనర్ మహేష్ యాదవ్, అఖిల్, అశోక్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.