27 April, 2026 | 8:34 PM

కూరగాయాల వ్యాపారుల ఆందోళన

27-04-2026 07:01 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి కూరగాయల హోల్సేల్ విక్రయాలను మార్కెట్ కాంప్లెక్స్ లోకి మార్చాలని కూరగాయల వ్యాపారస్తులు ఆందోళన చేశారు. పట్టణ మార్కెట్ సముదాయం ఎదుట కూరగాయల వ్యాపారస్తులు ధర్నా చేశారు. హోల్ సేల్ వ్యాపారుల విక్రయాల వల్ల తాము నష్టపోతున్నామని వాపోయారు. పద్మశాలి భవన ఎదురుగా నిర్వహిస్తున్న హోల్సేల్ విక్రయాలను వెంటనే నిలిపివేసి, కూరగాయల మార్కెట్లో అమ్మకాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ సంపత్ ఆందోళన కారులకు వద్దకు వచ్చి వ్యాపారస్తులకు  న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో కూరగాయల వ్యాపారస్తులు తమ ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు పాల్గొన్నారు.