4 April, 2026 | 2:44 AM

బైకును ఢీ కొట్టిన వాహనం

04-04-2026 12:00 AM
  1. ఒకరు మృతి
  2. మరొకరికి తీవ్ర గాయాలు

ఉట్నూర్, ఏప్రిల్ 03 (విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలం దన్నోరా (బి) గ్రామ శివారులోని పిప్రి క్రాస్ రోడ్ వద్ద ద్విచక్ర వాహనాన్ని మ్యాక్స్ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఆత్రం లక్ష్మణ్ (17) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు బైక్ పై ఉన్న కినక ప్రేమిత్  (16) కు తీవ్ర గాయాలయ్యాయి.

పిప్పిరి గ్రామానికి చెందిన ఆత్రం లోకేష్, కినక  ప్రేమి త్ లు దన్నోరా (బి) గ్రామానికి వచ్చి తిరిగి వెళుతుండగా.. ఇంద్రవెల్లి నుంచి గుడిహత్నూర్ వైపు మ్యాక్స్ వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని  తెలిపారు. తీవ్ర గాయాలైన  కినక  ప్రేమిత్‌ను 108 అంబులెన్స్ లో  రిమ్స్ కు తరలించినట్లు వారు తెలిపారు. సం ఘటన స్థలానికి ఎస్త్స్ర సాయన్న చేరుకొని పూర్తి వివరాలు సేకరించి  కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.