ఆధ్యాత్మిక పర్యటక కేంద్రంగా బాసర
ప్రభుత్వ సలహాలు సుదర్శన్‌రెడ్డి
నిర్మల్ ఏప్రిల్ 3 (విజయ క్రాంతి) : నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం బాసర ఆధ్యాత్మిక పర్యా టక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభు త్వం రూ. 1 30 కోట్లతో అభివృద్ధి పను లు చేపట్టాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఈనెల 6న ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బాసరలో చేపట్టబోయే అభి వృద్ధి యాక్షన్ ప్లాన్ పై సంబంధిత అధికారులతో ఏర్పాట్లను పరిశీలించారు.
బాసర అభివృద్ధికి ముఖ్యమంత్రి రావ డం బాసర టూరిజం అభివృద్ధి కేంద్రం గా మారినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయారుబిన్ అంద, మాజీ ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి, నారాయణ రావు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఈవో విజయ్ కుమార్, పైసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి తదితరులు ఉన్నారు.




