calender_icon.png 3 December, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనం పట్టివేత

03-12-2025 12:00:00 AM

చౌటుప్పల్, డిసెంబర్ 2 (విజయ క్రాంతి): చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు  తనిఖీ చేస్తుండగా ఏపీ 39 డబ్ల్యూ ఈ 1471 ని చెక్ చేయగా పైన మొత్తం పూర్తిగా ఉల్లిగడ్డ సంచులతో  కవర్ చేసి ఉండడంతో అనుమానం రావడంతో ఉల్లిగడ్డ సంచులను పైకి లేపి  చూడగా అందులో పది పశువులు ఉన్నాయి.  అట్టి పశువులను విశాఖపట్నంలో కొనుగోలు  చేసి  బహదూర్ పుర హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకోవడం జరిగింది. వాహన డ్రైవర్ పేరు భాస్కర్ సన్నాఫ్ గణేష్ వయసు 30 సంవత్సరాలు ఆర్‌ఓ ఆంధ్రప్రదేశ్ అని తెలిసినది. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.