calender_icon.png 3 December, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలపై హింసకు వ్యతిరేక పోరాటం సమష్టి బాధ్యత

03-12-2025 12:00:00 AM

నల్గొండ రూరల్, డిసెంబర్ 2: మహిళలపై జరుగుతున్న హింసను సమిష్టి బాధ్యతగా తీసుకొని అరికట్టాలని వైద్యులు విశ్వ జ్యోతి రాజేశ్వరి మంజుల లు అన్నారు. మంగళవారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సహాయం కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ‘మహిళలపై హింస ‘ అంశంపై నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు సమాజంలో మహిళలు అనేక రూపాలలో హింసను  ఎదుర్కొంటున్నారని డిజిటల్ హింస నానాటికి పెరిగిపోతున్న క్రమాన్ని వివరించారు.

మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ సదుపాయాలను న్యాయపరమైన సలహాలు సూచనలు అందించే మహిళ పోలీస్ స్టేషన్, సఖి సెంటర్, న్యాయ సదన్  సేవలను వివరించారు. మహిళలు, యువతులు మంచి పౌష్టికాహారం వ్యాయామాలు తో శారీరక మానసిక ఆరోగ్య కాపాడుకోవాలన్నారు వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ స్వీయ క్రమశిక్షణ  నిరంతర శ్రమతో ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సహాయం సెంటర్ కోఆర్డినేటర్ డా సూరం శ్వేత, డా లక్ష్మీప్రభ , డా వై ప్రశాంతి, ఆరట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డా అరుణప్రియ అధ్యాపకులు, విద్యార్థులు, లయన్స్ క్లబ్ సభ్యులు ఏదుల్ల అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.