2 July, 2026 | 3:07 PM

Breaking News

తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

వేం నరేందర్ రెడ్డికి బోయపల్లి శుభాకాంక్షలు

06-03-2026 07:23 PM

బడంగ్ పేట్,(విజయక్రాంతి): ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ  రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేసిన సందర్భంగా.. శుక్రవారం ఏఐసిసి విచార్ విభాగ్ కో ఆర్డినేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి నరేందర్ రెడ్డిని గచ్చిబౌలిలోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. వేం నరేందర్ రెడ్డి సేవలను గుర్తించి, వారికి రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. కార్యకర్తలకు, నాయకులకు ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటూ.. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు. వేం నరేందర్ రెడ్డి మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకర్షించారు.