2 July, 2026 | 4:07 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ

02-07-2026 03:00 PM
  1. సవాళ్లు విసిరి.. చర్చకు రాక పారిపోతున్న పిరికిపందలు ఈ కాంగ్రెసోళ్లు!
  2. మొన్న సీఎం రేవంత్... నేడు మంత్రి జూపల్లి.
  3. బీఆర్ఎస్‌ను ఎదుర్కొనే దమ్ము లేక వెన్నుచూపి పారిపోతున్నారు.
  4. అన్నీ సక్రమంగా ఉంటే... ఇంత భయమెందుకు?

హైదరాబాద్: మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) కోసం తెలంగాణ భవన్ లో కుర్చీ వేసి వేచి చూస్తున్నానని మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR) తెలిపారు. మంత్రి జూపల్లి కోసం శాలువాతో సిద్ధంగా ఉన్నా ఆయన రాలేదని కేటీఆర్ సూచించారు. గన్ పార్క్ వద్దకు చర్చకు రావాడానికి తాను సిద్ధం అన్నారు. మేం అక్కడికి వెళ్దామంటే అరెస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడ వేచి ఉంటే కాంగ్రెస్ నేతలు తోక ముడిచారని ఎద్దేవా చేశారు. అక్కడ కూర్చొని తొడలు కొడితే ప్రయోజనం ఏంటి?, పొంగులేటి మీద జరిగిన ఈడీ విచారణ ఏమైందో బండి సంజయ్ చెప్పాలి? అని కేటీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని మోదీ చెప్పారు. ప్రధాని చెప్పినప్పటికీ ఎందుకు చర్య తీసుకోలేదన్నారు. అమృత్ టెండర్లలో అవినీతిపై ఎందుకు విచారణ జరపలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చేతగానోళ్లు ఎందుకు మాట్లాడాలి?, అసలు జూపల్లి కృష్ణారావును అడిగింది ఎవరు?, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తే.. సందట్లో సడేమియాలా "నేను వస్తా" అంటూ మధ్యలో దూరింది నువ్వే.. చర్చకు రాకుండా పారిపోయి గన్ పార్క్ కి వెళ్తివి.. పోనీ మేము అక్కడికి వద్దామంటే పోలీసులతో అరెస్ట్ చేయించారని ఫైర్ అయ్యారు.