3 March, 2026 | 2:19 AM

హైకోర్టులో వేములవాడ దర్గా కేసు

03-03-2026 12:29 AM

ఎక్స్‌టెన్షన్ ఆర్డర్ లేదని స్పష్టం 

వేములవాడ, మార్చి 2 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ దర్గా అంశంపై దాఖలైన రిట్ పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టులో కీలక విచా రణ జరిగింది. ఈ పిటిషన్‌ను గడప కిషోర్‌రావు దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున బీజేపీ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాది రేగుల రాజ్‌కుమార్ వాదనలు వినిపించారు. విశ్వహిందూ పరిషత్ తరఫున న్యా యవాదులు శివప్రసాద్, రామకృష్ణ కోర్టు దృష్టికి అంశాలను తీసుకువచ్చారు.

విచారణ సందర్భంగా  న్యాయస్థానం ముఖ్య వ్యాఖ్యలు చేసింది. సంబంధిత తేదీకి ఎటువంటి ఎక్స్‌టెన్షన్ ఆర్డర్ జారీ కాలేదని స్ప ష్టంగా తెలిపింది. ఇక, వివాదాస్పద స్థలంలో ఉన్న పాత నిర్మాణం ఇప్పటికే తొలగించబడిందని, ప్రస్తుతం అక్కడ కొత్త నిర్మాణం కొనసాగుతోందని ప్రతివాదుల తరఫున కోర్టు ముందు అంగీకారం వ్యక్తమైందని విచారణలో వెల్లడైంది.

ఈ పరిణామాల నేపథ్యంలో వేములవాడలో నెలకొన్న పరిస్థితు లపై చట్టపరమైన స్పష్టత అవసరమని స్థానికులు అభిప్రాయపడ్డారు. హైకోర్టులో జరిగి న విచారణతో ప్రజల్లో నెలకొన్న అనేక సం దేహాలకు సమాధానం లభించిందని వారు పేర్కొన్నారు.