ఆయకట్టు మరమ్మతులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
మరమ్మత్తులకు రూ.48.7 లక్షలు మంజూరు
నారాయణఖేడ్, మార్చి 2: మనూరు మండల పరిధిలోని గట్టు లింగంపల్లి చెరువు ఆయకట్టు మరమ్మత్తుల పనులకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి సోమవారం భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గట్టు లింగంపల్లి కుడి ఎడమ కాలువల మరమ్మత్తులకు సంబంధించి ఇరిగేషన్ శాఖ ద్వారా రూ. 48.7 లక్షల నిధులు మంజూరు అవడం జరిగిందని తెలిపారు. ఇందులో ఎడమ కాలువకు సంబంధించి 1.4 కిలోమీటర్లు, కుడి కాల్వకు సంబంధించి 1.2 కిలోమీటర్ల మేర కాలువల మరమ్మత్తులు చేపట్టడం జరుగుతుందన్నారు. దీంతో ఆయకట్టు పరిధిలో 240 నుండి300 ఎక రాలకు సాగునీరు అందుతుందని అన్నారు.
గత ప్రభుత్వం గట్టు లింగంపల్లి ప్రాజెక్టు చేపడుతామని ప్రజలను నమ్మించి దాన్ని విస్మరించారని ఆరోపించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజిరెడ్డి, స్థానిక సర్పంచ్ చంద్ర లీల, ఉప సర్పంచ్ ప్రతిభ అనిల్ పా టిల్, రుద్రారం సర్పంచ్ పూలమ్మ, మాజీ సర్పంచులు బ్రహ్మానంద రెడ్డి, షేరి రాజు నాయకులు శ్రీకాంత్ రెడ్డి, సామెల్, ధన్ రాజ్ పాటిల్, దౌలత్ రావు పాటిల్, కాశీనాథ్ పాటిల్, రఘుపతి రెడ్డి, ఆయకట్టు రైతులు తదితరులు పాల్గొన్నారు.




