15-02-2026 12:33:55 AM
వేములవాడ, ఫిబ్రవరి14,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేముల వాడ మహాశివరాత్రి జాతరను పురస్కరించుకుని భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాయి. జాతరకు భారీగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో సమాచారం నుంచి భ ద్రత వరకు ప్రతి అంశంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మార్గదర్శకత్వంలో ఏర్పాట్లు దశల వారీగా అమలవుతున్నాయి.
జాతర ప్రాంతమంతా భక్తులకు అవసరమైన సమాచారం అందేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేశా రు. దర్శన మార్గాలు, క్యూలైన్లు, తాగునీటి కేంద్రాలు, మరుగుదొడ్లు, హెల్ప్ డెస్క్‌లను సులభంగా గుర్తించేందుకు తెలుగులో స్పష్టమైన బోర్డులు ఏర్పాటు చేశారు.కాగా చిన్నారులతో వచ్చే తల్లుల కోసం ప్రత్యేకంగా బేబీ ఫీడింగ్ రూమ్‌లను సిద్ధం చేశారు. పరిశుభ్రమైన వాతావరణం, గోప్య త, కూర్చునే సదుపాయాలతో ఈ కేంద్రా లు అందుబాటులోకి తీసుకొచ్చారు.
అలా గే దివ్యాంగులు, వృద్ధులు సౌకర్యంగా దర్శ నం చేసుకునేలా సుమారు 100 వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు. ప్రధాన ప్రవేశ ద్వారాలు, హెల్ప్ డెస్క్‌ల వద్ద సిబ్బంది సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నా రు. భక్తులకు తాగునీరు అందించేందుకు ప్లాస్టిక్‌కు బదులుగా స్టీల్ గ్లాసులను వినియోగిస్తున్నారు. దర్శన సమయాలు, వస తి, వైద్యసేవలు, ఇతర సమాచారం కోసం 10 హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు.
పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య పనులు నిరంతరంగా కొనసాగుతున్నాయి. చెత్త తొలగింపునకు ప్రత్యేక బృ ందాలు పని చేస్తున్నాయి. భక్తుల ఆరోగ్య రక్షణ కోసం వైద్య శిబిరాలు, అత్యవసర సేవలు అందుబాటులో ఉంచారు. సీసీ కెమెరాల ద్వారా భక్తుల రాకపోకలు, క్యూలైన్లు, భద్రతా ఏర్పాట్లను కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.